ట్రంప్‌ తీరుతో రిపబ్లికన్‌ పార్టీలో చీలికలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన ఆయన సొంత పార్టీ రిపబ్లికన్‌లో చీలకలకు కారణమవుతోంది. ట్రంప్‌ తీరుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న కొంత మంది రిపబ్లికన్లు.. ఆయనను తొలగించేందుకు ప్రతినిధుల.....

Updated : 13 Jan 2021 13:36 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన ఆయన సొంత పార్టీ రిపబ్లికన్‌లో చీలకలకు కారణమవుతోంది. ట్రంప్‌ తీరుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న కొంత మంది రిపబ్లికన్లు.. ఆయనను తొలగించేందుకు ప్రతినిధుల సభలో ప్రవేశపెడుతున్న అభిశంసనకు మద్దతుగా ఓటేయనున్నట్లు ప్రకటించారు. 

తొలుత రిపబ్లికన్ పార్టీలో మూడో అత్యంత శక్తిమంతమైన నేతగా పెరుగాంచిన లిజ్‌ చెనీ ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు పలికారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష హోదాను ట్రంప్‌ దుర్వినియోగపరిచినంతగా మరెవరూ చేయలేదని ఆమె విమర్శించారు. క్యాపిటల్‌ భవనంపై దాడి ట్రంప్‌ పిలుపు మేరకే జరిగిందని ఆరోపించారు. దాడి జరిగే సమయంలో ట్రంప్‌ జోక్యం చేసుకొని నిలువరించాల్సిందని అభిప్రాయపడ్డారు. మరో నేత ఆడమ్‌ కిన్‌జింగర్‌, జాన్‌ కట్కో కూడా చెనీ బాటలోనే పయనించనున్నట్లు ప్రకటించారు. మరికొంత మంది కూడా ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్లు అమెరికా మీడియా పేర్కొంది.

అదే పార్టీలోని మరో వర్గం ట్రంప్‌ అభిశంసనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చివరి రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభించడం కేవలం రాజకీయ కుట్రేనని ఆరోపించింది. దీనివల్ల అధికార బదిలీకి ఆటంకం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అయితే, డెమొక్రాట్లు మాత్రం ట్రంప్‌ తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నేడు ప్రతినిధుల సభలో అభిశంసనపై ఓటింగ్‌ జరగనుంది. 

ఇవీ చదవండి..

వాషింగ్టన్‌లో ఆత్యయిక పరిస్థితి

అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని