Channi: నేనేమీ ఉగ్రవాదిని కాదు.. : పంజాబ్‌ సీఎం చన్నీ

రాహుల్‌ గాంధీ ర్యాలీలో పాల్గొనకుండా అధికారులు అడ్డుకొన్నారని పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ఆరోపించారు. ప్రధాని పర్యటనను సాకుగా చూపి తన విమానం ఎగిరేందుకు

Published : 15 Feb 2022 11:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాహుల్‌ గాంధీ ర్యాలీలో పాల్గొనకుండా అధికారులు తనను అడ్డుకొన్నారని పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఆరోపించారు. ప్రధాని పర్యటనను సాకుగా చూపి తన హెలికాప్టర్‌ ఎగిరేందుకు అనుమతించలేదని మండిపడ్డారు. ‘‘చరణ్‌జిత్‌ చన్నీ ఒక ముఖ్యమంత్రి. హోషియార్‌పూర్‌కు వాయు మార్గంలో వెళ్లకుండా అడ్డుకోవడానికి నేను ఉగ్రవాదిని కాదు. ఇది పద్ధతి కాదు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ జలంధర్‌ పర్యటనకు వస్తోన్న సమయంలోనే చన్నీ కూడా చండీగఢ్‌ నుంచి హోషియార్‌పూర్‌లోని రాహుల్‌ పర్యటనకు హెలికాప్టర్‌లో బయల్దేరారు. ప్రధాని పర్యటన ఉండటంతో నోఫ్లైజోన్‌ విధించిన అధికారులు దాదాపు గంటసేపు చన్నీ హెలికాప్టర్‌కు క్లియరెన్స్‌ ఇవ్వలేదు. దీంతో హెలిప్యాడ్‌ నుంచి చన్నీ వెళ్లిపోయారు.

‘‘నేను ఉనాలో 11 గంటలకల్లా సిద్ధంగా ఉన్నాను. కానీ, పీఎం పర్యటనను కారణంగా చెబుతూ హఠాత్తుగా అనుమతులు నిరాకరించారు. ఆ ప్రాంతాన్ని నోఫ్లై జోన్‌గా ప్రకటించారు. హోషియార్‌పూర్‌లో రాహుల్‌ పర్యటనలో పాల్గొనడం సాధ్యం కాలేదు’’ అని చన్నీ వివరించారు. ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ముఖ్యమంత్రి పర్యటనకు అనుమతులు రద్దు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ నేత సునీన్‌ జాఖర్‌ మండిపడ్డారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించకపోతే ఈ ఎన్నికలు బూటకమే అనుకోవాలని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని