ICSE, ISC Results 2021: 10, 12వ తరగతి ఫలితాలు విడుదల

ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను  కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ .....

Updated : 18 Dec 2022 16:00 IST

దిల్లీ: ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను  కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్ బోర్డు (సీఐఎస్‌సీఈ) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది ఐసీఎస్‌ఈ పదో తరగతిలో 99.98శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఐఎస్‌సీ 12వ తరగతిలో 99.76శాతం నమోదైంది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా ఈ ఫలితాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కెరీర్స్‌ పోర్టల్‌ ద్వారా టాబ్యులేషన్ రిజిస్ట్రర్లను పాఠశాలలకు అందుబాటులో ఉంచుతున్నట్టు సీఐఎస్‌సీఈ బోర్డు కార్యదర్శి గెర్రీ అరథోన్‌ శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. 

దాదాపు మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురు చూస్తున్న ఈ ఫలితాలను cisce.org లేదా results.cisce.orgలో అందుబాటులో ఉంచారు. 

SMS ద్వారా ఫలితాలు పొందొచ్చు.. 

సీఐఎస్‌సీఈ ఫలితాలను తెలుసుకొనేందుకు ఐసీఎస్‌ఈ విద్యార్థులైతే ICSE (Unique ID) టైప్‌ చేసి 09248082883 నంబర్‌కు పంపాలి. అలాగే, ఐఎస్‌సీ 12వ తరగతి విద్యార్థులైతే ISC (unique ID) టైప్‌ చేసి పైన పేర్కొన్న నెంబర్‌కే పంపి ఫలితాలు పొందవచ్చు. 

అభ్యంతరాలకు గడువు ఆగస్టు 1 వరకు..

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగడంతో ఐసీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. అయితే, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. నిష్పాక్షిక, పారదర్శక విధానంలో విద్యార్థుల ప్రతిభను మదింపు వేసి ఫలితాలను ప్రకటించారు. ఫలితాలు, కేటాయించిన మార్కులకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యంతరాలను తెలియజేయడానికి ఆగస్టు 1 వరకు గడువు ఇస్తున్నట్టు సీఐఎసీఈ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఫలితాలతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వారికి కరోనాతో నెలకొన్న పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాక పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే బోర్డు స్పష్టంచేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని