CUET-PG 2023: సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్‌ ఇదే.. UGC ఛైర్మన్‌ ట్వీట్‌!

CUET PG 2023: దేశంలోని పలు ప్రఖ్యాత యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం  ‘ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)-పీజీ’ షెడ్యూల్‌ విడుదలైంది. 

Updated : 20 Mar 2023 17:49 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రముఖ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)-పీజీ’(CUET-PG 2023) కు దరఖాస్తులు సోమవారం నుంచే ప్రారంభం కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 20న రాత్రి నుంచి ఏప్రిల్‌ 19వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని యూజీసీ(UGC) ఛైర్మన్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ ట్విటర్‌లో వెల్లడించారు. దరఖాస్తు రుసుంను డెబిట్‌/క్రెడిట్‌ కార్డులతో పాటు నెట్‌బ్యాంకింగ్‌, యూపీఐ ద్వారా ఆన్‌లైన్లో చెల్లించవచ్చని సూచించారు. ఈ పరీక్షకు అభ్యర్థుల అర్హత, పరీక్ష కేంద్రాలు, పరీక్ష ఫీజు, సమయం, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తదితర వివరాలను ఈరోజు రాత్రి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ఎప్పటికప్పుడు తమ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా 66 కేంద్రీయ, రాష్ట్రీయ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం గతేడాది NTA నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 6.07 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

యూజీ ఛైర్మన్‌ ట్వీట్‌ ప్రకారం ముఖ్య తేదీలివే.. 

  • దరఖాస్తుల స్వీకరణ: మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 19 సాయంత్రం 5గంటల వరకు
  • ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు: ఏప్రిల్‌ 19న రాత్రి 11.50గంటల వరకు
  • దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు గడువు: ఏప్రిల్‌ 20 నుంచి 23వరకు
  • అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌, పరీక్ష తేదీ తదితర అంశాలను తర్వాత ప్రకటిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు