CUET-UG: రద్దయిన సీయూఈటీ-యూజీ పరీక్షల నిర్వహణ ఆగస్టు 24-28 తేదీల్లో

సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 4న వాయిదా పడిన సీయూఈటీ-యూజీ పరీక్షను ఈ నెల 24-28 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తెలిపింది....

Updated : 18 Aug 2022 14:19 IST

దిల్లీ: సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 4న వాయిదా పడిన సీయూఈటీ-యూజీ (CUET-UG ) పరీక్షను ఈ నెల 24-28 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తెలిపింది. వీరికి కొత్త అడ్మిట్‌ కార్డులు జారీ చేస్తామని పేర్కొంది. తొలుత 12, 14 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, వరుస పండుగల నేపథ్యంలో పరీక్ష తేదీల్ని మార్చాలని పలువురు విద్యార్థులు విజ్ఞప్తి చేసినట్లు ఎన్‌టీఏ తెలిపింది. దీంతో కొత్త తేదీల్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 4న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CUET-UG ) నిర్వహించారు. సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో కొన్ని కేంద్రాల్లో తొలి విడత, మొత్తం 489 కేంద్రాల్లో రెండో విడత పరీక్ష రద్దయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని