Meghalaya: షిల్లాంగ్‌లో కర్ఫ్యూ.. నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్‌ నిలిపివేత

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిన్నివ్రేప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్(హెచ్‌ఎన్‌ఎల్‌సీ) నేత చెరిస్టర్‌ఫీల్డ్ తాంగ్‌కీవ్ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ.. ఆదివారం అంత్యక్రియల సందర్భంగా

Updated : 16 Aug 2021 04:10 IST

ఉద్రిక్తతలకు దారితీసిన ఉగ్రవాద నేత ఎన్‌కౌంటర్‌

షిల్లాంగ్‌: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిన్నివ్రేప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్(హెచ్‌ఎన్‌ఎల్‌సీ) నేత చెరిస్టర్‌ఫీల్డ్ తాంగ్‌కీవ్ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ.. ఆదివారం అంత్యక్రియల సందర్భంగా అతని మద్దతుదారులు రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌ తదితర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు వాహనాన్ని తగులబెట్టారు. దీంతో అప్రమత్తమైన అధికారులు షిల్లాంగ్‌లో ఆదివారం రాత్రి 8 నుంచి మంగళవారం ఉదయం 5 వరకు కర్ఫ్యూ విధించారు. తూర్పు ఖాసీ హిల్స్‌, పశ్చిమ ఖాసీ హిల్స్‌, నైరుతి ఖాసీ హిల్స్‌, రి-భోయ్‌ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి 48 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేసినట్లు వెల్లడించారు. 

నివేదిక కోరిన హక్కుల కమిషన్‌

హెచ్‌ఎన్‌ఎల్‌సీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తాంగ్‌కీవ్‌ 2018లో పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం జరిగిన ఆయా బాంబు దాడుల వెనుక అతని పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ క్రమంలో ఈ నెల 13న అరెస్ట్ చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా.. కత్తితో దాడి చేశాడని, ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమైనట్లు డీజీపీ చంద్రనాథన్ వెల్లడించారు.  మరోవైపు మేఘాలయ మానవ హక్కుల కమిషన్ ఈ ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనపై 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని