America: అక్కడ మాస్క్ ధరిస్తే జరిమానా..!
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వాలు నిబంధన విధించాయి. అంతేనా.. మాస్క్ ధరించపోతే జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అయితే, ఇటీవల అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో ఇకపై మాస్క్‌లు ధరించాల్సిన
కాలిఫోర్నియా: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వాలు నిబంధన విధించాయి. అంతేనా.. మాస్క్ ధరించపోతే జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అయితే, ఇటీవల అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో ఇకపై మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని ఆ దేశాధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని ఫిడిల్‌హెడ్ కేఫ్ రెస్టారెంట్ విస్తుపోయే నిబంధన అమలు చేస్తోంది. రెస్టారెంట్లోకి మాస్క్ ధరించి వస్తే బిల్లుపై 5 డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
అమెరికాలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేకున్నా చాలా మంది కరోనా వ్యాప్తికి భయపడి మాస్క్‌లు ధరించే రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది రెస్టారెంట్‌లో అదనంగా 5 డాలర్లు చెల్లించడానికైనా సిద్ధపడుతున్నారు గానీ మాస్క్ తీసేయడానికి ససేమిరా అంటున్నారు. దీంతో రెస్టారెంట్‌లో బిల్లుపై అదనంగా 5 డాలర్లు చొప్పున బాగానే వసూలవుతున్నాయి. అయితే, ఇలా వసూలైన నగదును స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు ఆ రెస్టారెంట్ యజమాని క్రిస్ కాస్టిల్‌మ్యాన్ వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థకు చేయూత ఇవ్వడం కోసం కస్టమర్ల నుంచి 5 డాలర్లు ఈ విధంగా వసూలు చేయడం తన దృష్టిలో తప్పు కాదని క్రిస్ చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)