Cyber Crimes: టాస్క్‌ పేరుతో సైబర్‌ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ

సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలో మోసానికి తెరలేపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్‌ దోస్త్‌ సోషల్‌ మీడియాలో ప్రత్యేక వీడియోను షేర్ చేసింది.

Published : 25 Sep 2023 02:05 IST

దిల్లీ: సైబర్‌ మోసాల (Cyber Frauds) గురించి ప్రజలకు నిత్యం అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. రోజుకో కొత్త పంథాలో నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా ప్రకటనలు, ఓటీపీలు, ఆఫర్ల పేరుతో యూజర్ల నుంచి నగదు తస్కరించిన సైబర్‌ నేరగాళ్లు.. తాజాగా కొత్త తరహా మోసాలకు తెర లేపారు. టాస్క్‌-బేస్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (Taks-Based Investment Scams) పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు.

సోషల్‌మీడియా ఖాతాలను ఫాలో అవ్వడం, యూట్యూబ్‌ వీడియోలకు లైక్‌లు, కామెంట్‌లు చేయడం, హోటళ్లు, రెస్టారెంట్‌లు, సినిమాలకు రివ్యూ ఇవ్వడం ద్వారా ఆదాయం పొందొచ్చని ఆశ చూపి యూజర్ల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఎక్కువగా టెలిగ్రామ్ యాప్‌లో జరుగుతున్నాయని సైబర్‌ నేరాల నియంత్రణ కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్‌ దోస్త్‌ (Cyber Dost) తెలిపింది. 

‘అందుకే.. సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’

ఈ తరహా మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫోన్‌కు ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో మెసేజ్‌లు వస్తే వాటి నమ్మొద్దని హెచ్చరించింది. వీటి గురించి cybercrime.gov.in వెబ్‌సైట్‌లో లేదా 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది. తాజాగా టాస్క్‌-బేస్డ్‌ మోసాల గురించి అవగాహన కల్పిస్తూ ఎక్స్‌లో 39 సెకన్ల నిడివి ఉన్న వీడియోను పోస్ట్‌ చేసింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు