Cylinder Blast: ఘోరం.. పెళ్లిలో పేలిన ఐదు సిలిండర్లు

రాజస్థాన్‌ (Rajasthan)లో పెళ్లి వేడుకల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వంటలు చేస్తుండగా సిలిండర్లు (Cylinder Blasts) పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Updated : 09 Dec 2022 10:39 IST

జైపూర్‌: రాజస్థాన్‌ (Rajasthan)లోని జోధ్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకల్లో సిలిండర్లు (Cylinder Blasts) పేలి ఐదుగురు దుర్మరణం చెందగా.. దాదాపు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 

జోధ్‌పూర్‌లోని భంగ్రా గ్రామంలో గురువారం రాత్రి ఓ ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అతిథులకు వంటలు సిద్ధం చేస్తుండగా వంట గదిలో ఉన్న ఐదు సిలిండర్లు పేలాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. పేలుడు తీవ్రతకు ఇల్లు కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో 49 మంది గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 12 మందికి తీవ్రంగా కాలిన గాయాలు అవడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని