కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువ: కేంద్రం

దేశంలో 27 రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుత కొవిడ్‌-19 పరిస్థితులను, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ సమీక్షించి సోమవారం ఈ ప్రకటన చేసింది

Updated : 24 May 2021 21:42 IST

దిల్లీ: దేశంలో 27 రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుత కొవిడ్‌-19 పరిస్థితులను, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ సమీక్షించి సోమవారం ఈ ప్రకటన చేసింది.  మే 3 నుంచి రికవరీ రేటు పెరుగుతోందని, గత రెండు వారాల వ్యవధిలో 10 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా వాటి సంఖ్య క్రమంగా తగ్గుతోందని స్పష్టం చేసింది. 

గత 17 రోజుల నుంచి దేశంలో రోజువారీ కేసులు క్రమంగా క్షీణిస్తున్నాయి. రికవరీరేటు పెరుగుతోంది.  నిన్న ఒక్కరోజే 3,02,544 మంది కోలుకోగా ఇప్పటి వరకూ రికవరీల సంఖ్య 2,37,28,011 గా ఉంది. దీంతో రికవరీ రేటు 88.69 శాతానికి చేరింది. 45 ఏళ్లు పైబడిన వారికి మొత్తం 14.56 కోట్ల (రెండు డోసుల కలిపి) టీకాలు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. 18 నుంచి 44 ఏళ్ల వయసున్న వారికి 1.06 కోట్ల వ్యాక్సిన్‌లు (మొదటి డోసు) అందించింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో 2,22,315 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇంతవరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,67,52,447గా ఉంది. క్రియాశీల రేటు 10.17 శాతానికి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని