₹100 crore credited: కూలీ ఖాతాలో రూ.100 కోట్లు జమ

అతడో దినసరి కూలీ. అతడి బ్యాంకు ఖాతాలో రూ.17 మాత్రమే ఉండగా, అనూహ్యంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. అవి ఎలా వచ్చాయో అర్థం కాక తల పట్టుకుంటుంటే.. వాటికి లెక్క చెప్పాలంటూ పోలీసుల నుంచి నోటీసులు రావడంతో అతడు భయాందోళనలకు లోనవుతున్నాడు.

Updated : 26 May 2023 08:33 IST

సైబర్‌ క్రైమ్‌ పోలీసుల నోటీసులు

అతడో దినసరి కూలీ. అతడి బ్యాంకు ఖాతాలో రూ.17 మాత్రమే ఉండగా, అనూహ్యంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. అవి ఎలా వచ్చాయో అర్థం కాక తల పట్టుకుంటుంటే.. వాటికి లెక్క చెప్పాలంటూ పోలీసుల నుంచి నోటీసులు రావడంతో అతడు భయాందోళనలకు లోనవుతున్నాడు. పశ్చిమ బెంగాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దేగంగాలోని వాసుదేవ్‌పుర్‌కు చెందిన మహ్మద్‌ నసీరుల్లా(26) వ్యవసాయ కూలీ. అతడికి ఎస్బీఐలో ఖాతా ఉంది. ఇటీవల అతడి ఖాతాలో ఒక్కసారిగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆయనకు జంగీపుర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు పంపారు. ఈ నెల 30లోగా ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని