Darshan Case: మృతదేహాన్ని మాయం చేసేందుకు రూ.30 లక్షలు ఇచ్చా: దర్శన్‌

తన అభిమాని రేణుకాస్వామి మృతదేహాన్ని మాయం చేసేందుకు నటుడు దర్శన్‌ మరో నిందితుడికి రూ. 30 లక్షలు ఇచ్చినట్లు విచారణలో తేలింది.

Published : 20 Jun 2024 00:13 IST

దిల్లీ: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌ (Darshan) అభిమాని హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకొంది. అభిమాని హత్య అనంతరం మృతదేహాన్ని ఎవరి కంట పడకుండా మాయం చేసేందుకు దర్శన్‌ మరో నిందితుడికి రూ. 30 లక్షలు ముట్టజెప్పినట్లు తేలింది. ఈ నేరాన్ని దర్శన్‌ స్వయంగా అంగీకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

అభిమాని హత్య కేసులో దర్శన్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. కస్టడీకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. రేణుకాస్వామి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలని మరో నిందితుడైన ప్రదేశ్‌కు రూ.30లక్షలు ఇచ్చినట్లు దర్శన్‌ అంగీకరించాడు. ఈ వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తన పేరు బయటకు రాకుండా చూడాలని కోరినట్లు తెలిపాడట. దర్శన్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నిను వీడని నీడను నేనే: భర్తను చంపేందుకు ప్లాన్‌-ఏ, బీ అమలు..!

తన అభిమాన నటుడు దర్శన్‌ వ్యక్తిగత జీవితంలో పవిత్రా గౌడ చిచ్చు పెడుతోందంటూ ఆయన అభిమాని రేణుకాస్వామి సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టాడు. ఈ క్రమంలోనే అతడు హత్యకు గురి కావడం సంచలనం రేపింది. ఈ కేసులో దర్శన్‌ సహా 17 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. హత్యకు ముందు అతడిని చిత్ర హింసలకు గురి చేయడంతోపాటు కరెంట్‌ షాక్‌ ఇచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలోనే మృతదేహాన్ని మాయం చేసేందుకు వారు పన్నిన కుట్రకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని