Darshan: అభిమానిని చంపి.. భార్య ఫ్లాట్‌లో పూజలు: నటుడు దర్శన్‌ నిర్వాకం

అభిమాని హత్య అనంతరం నటుడు దర్శన్‌ ఏమీ తెలియని వాడిలా భార్య ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. 

Published : 20 Jun 2024 10:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీప(Darshan)కు సంబంధించిన సంచలన విషయాలను పోలీసులు వెలికితీస్తున్నారు. తాజాగా దర్శన్‌ వినియోగించిన లోఫర్స్‌ ఆయన భార్య విజయలక్ష్మి ఫ్లాట్‌ వద్ద గుర్తించారు. వీటినే హత్య సమయంలో అతడు వినియోగించాడు. వీటి రికవరీతో కేసులో కీలక ఆధారాలను పోలీసులు దక్కించుకొన్నట్లైంది. 

హత్య అనంతరం 9వ తేదీ తెల్లవారుజామున రేణుకాస్వామి మృతదేహాన్ని పారేసి హోస్కెరహల్లిలోని భార్య విజయలక్ష్మి ఫ్లాట్ కు దర్శన్‌ చేరుకొన్నాడు. అక్కడినుంచి మైసూర్‌ బయల్దేరే ముందు ఇంట్లో పూజలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆమెకు కూడా పోలీసులు సమన్లు జారీ చేసి బుధవారం ఐదు గంటలపాటు విచారించారు. అంతేకాదు.. ఆ లోఫర్స్‌ను ఎవరైనా కడిగారేమోనని అడిగి తెలుసుకొన్నారు. 

ఈ హత్య అనంతరం కొన్ని దుస్తులు, ఫుట్‌వేర్‌ను దర్శన్‌ కాస్ట్యూమ్‌ అసిస్టెంట్‌ రాజు తెచ్చి విజయలక్ష్మికి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆమెను సాక్షిగా పోలీసులు భావించే అవకాశాలున్నాయి.   

దర్శన్‌ ఫ్యాన్‌ క్లబ్‌పై పోలీసుల కన్ను..

రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ ఫ్యాన్‌ క్లబ్‌లోని వారు కీలకపాత్ర పోషించడంతో.. ఇప్పుడు పోలీసుల కన్ను వారిపై పడింది. రాష్ట్రవ్యాప్తంగా దర్శన్‌ ఫ్యాన్‌క్లబ్‌ కార్యకలాపాలపై దృష్టిసారించారు. వీరందరికీ దర్శన్‌తోపాటు అతడి దర్శక నిర్మాతల నుంచి ఆకర్షణీయమైన మొత్తాలు అందుతున్నట్లు గుర్తించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని