Updated : 21/07/2021 07:00 IST

మా అత్తకు బాయ్‌ఫ్రెండ్‌ కావాలి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ‘వరుడు లేదా వధువు కావలెను’ అని ప్రకటన ఇస్తుంటారు. అయితే ఇందుకు భిన్నంగా అమెరికాలోని ఓ కోడలు తన అత్తకు బాయ్‌ ఫ్రెండ్‌ కావాలని ప్రకటన ఇచ్చింది. అలా వచ్చే వారికి వెయ్యి డాలర్లు చెల్లిస్తామని ప్రకటించింది. దాంతో పాటు కొన్ని షరతులు కూడా పెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఓ కోడలు తన 51 ఏళ్ల అత్తయ్యతో కాస్త సమయం గడిపి, వారితో పాటు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 40-60 ఏళ్ల మధ్య వయస్సున్న వారు బాయ్​ఫ్రెండ్‌గా అద్దెకు కావాలని క్రెయిగ్స్​లిస్ట్​ అనే క్లాసిఫైడ్స్​ వెబ్​సైట్‌లో ప్రకటన ఇచ్చింది. అందుకోసం 960 డాలర్లు  (సుమారు ₹72,000) ఇస్తానని తెలిపింది. బాయ్‌ ఫ్రెండ్‌గా వచ్చే వారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు బాగా డాన్స్​కూడా వచ్చి ఉండాలని షరతు పెట్టింది. ప్రస్తుతం ఆ ప్రకటన నెట్టింట్లో వైరల్‌ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు విభిన్న రీతుల్లో స్పందిస్తున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని