Bipin Rawat: గంగమ్మ ఒడికి రావత్​ దంపతుల అస్థికలు

భారత త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ దంపతుల అస్థికలను శనివారం ఉదయం ఉత్తరాఖండ్ హరిద్వార్​లోని గంగానదిలో వారి కుమార్తెలు కృతిక, తరణి కలిపారు. శుక్రవారం సాయంత్రం దిల్లీలోని బ్రార్​ స్క్వేర్​ శ్మశానవాటికలో వారి అంత్యక్రియలను నిర్వహించారు. 

Updated : 11 Dec 2021 15:52 IST

హరిద్వార్‌: భారత త్రిదళాధిపతి బిపిన్​ రావత్​  ఆయన సతీమణి మధులిక అస్థికలను శనివారం ఉదయం ఉత్తరాఖండ్ హరిద్వార్​లోని గంగానదిలో వారి కుమార్తెలు కృతిక, తరణి కలిపారు. శుక్రవారం సాయంత్రం దిల్లీలోని బ్రార్​ స్క్వేర్​ శ్మశానవాటికలో వారి అంత్యక్రియలను నిర్వహించారు.  శనివారం ఉదయం చితాభస్మాల్ని సేకరించి.. నేరుగా హరిద్వార్​ చేరుకుని నదిలో కలిపారు. నదీ తీరంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈనెల 8న తమిళనాడులోని జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో సీడీఎస్​ బిపిన్​ రావత్​ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం దిల్లీలోని బ్రార్​ స్క్వేర్​​లో అధికారిక లాంఛనాలతో జరిపిన అంత్యక్రియల్లో త్రివిధదళాలు గౌరవసూచికంగా 17 శతఘ్నులను గాల్లోకి పేల్చి వందనం సమర్పించారు. సీడీఎస్‌ అంత్యక్రియల్లో 800 మంది సర్వీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ , దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తదితరులు హాజరై తుది వీడ్కోలు పలికారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని