పిల్లలకోసం ఆన్‌లైన్‌ గేమ్స్‌ డి-అడిక్షన్‌ సెంటర్లు

తిరువనంతపురం: ఇప్పటి వరకు మద్యం, ధూమపానం.. ఈ రెండింటికే డి-అడిక్షన్‌ సెంటర్లు నిర్వహిస్తారని వింటూ వచ్చాం. కానీ కేరళ ప్రభుత్వం ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బానిసవుతున్న చిన్నారులను దృష్టిని పెట్టుకొని డిజిటల్‌ ఆన్‌లైన్‌ గేమ్స్‌ డి-అడిక్షన్‌ సెంటర్లను ప్రారంభించనుంది. తరచూ డిజిటల్‌ గేమ్స్‌ ఆడటం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలెక్కువ. ఆ సమస్యల నుంచి బయటపడేందుకు ‘‘ డిజిటల్‌ డి-అడిక్షన్‌ సెంటర్లు’’ను కేరళలో ప్రారంభిస్తున్నట్లు

Published : 25 Sep 2021 23:30 IST

తిరువనంతపురం: ఇప్పటి వరకు మద్యం, ధూమపానం.. ఈ రెండింటికే డి-అడిక్షన్‌ సెంటర్లు నిర్వహిస్తారని వింటూ వచ్చాం. కానీ కేరళ ప్రభుత్వం ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బానిసవుతున్న చిన్నారులను దృష్టిని పెట్టుకొని డిజిటల్‌ ఆన్‌లైన్‌ గేమ్స్‌ డి-అడిక్షన్‌ సెంటర్లను ప్రారంభించనుంది. తరచూ డిజిటల్‌ గేమ్స్‌ ఆడటం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలెక్కువ. ఆ సమస్యల నుంచి బయటపడేందుకు ‘‘ డిజిటల్‌ డి-అడిక్షన్‌ సెంటర్లు’’ను కేరళలో ప్రారంభిస్తున్నట్లు శనివారం ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి విజయన్‌ ప్రకటించారు. ఈమేరకు రాష్ర్టంలోని 20 పోలీస్‌ స్టేషన్లను ‘‘చైల్డ్‌-ఫ్రెండ్లి’’గా ప్రకటించారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం  మాట్లాడుతూ.. ‘‘ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటుపడిన పిల్లలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకే ఈ ప్రయత్నం.’’ తెలిపారు.ఆన్‌లైన్‌ గేమింగ్‌ రాష్ట్రంలో అనేకమంది విద్యార్థులకు వ్యసనంగా మారింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని