Manipur landslide: 42కు చేరిన మణిపుర్‌ మృతుల సంఖ్య.. ఇంకా లభించని 25 మంది ఆచూకీ..!

మణిపుర్‌ నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న చోట కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది.......

Updated : 04 Jul 2022 05:29 IST

గువాహటి: మణిపుర్‌ నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న చోట కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. జిరిబమ్‌-ఇంఫాల్‌ మార్గంలో తుపుల్‌ రైల్వే యార్డు వద్ద జరిగిన ఈ ఘటనలో ఇంకా 25 మంది కోసం అధికారులు విసృతంగా గాలింపు చేపడుతున్నారు. అయితే వర్షాలు ఈ గాలింపు చర్యలకు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు ముగుస్తుండటంతో ఆచూకీ లభించని వారంతా మృతిచెంది ఉంటారని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించుకున్నట్లు తెలుస్తోంది.

శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు 42 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని, వారిలో 27 మంది టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది, 15 మంది పౌరులు ఉన్నారని గువహటిలోని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఆచూకీ లభించని 20 మంది కోసం గాలిస్తున్నామని, చివరి వ్యక్తి దొరికేవరకు చర్యలు కొనసాగుతాయన్నారు. ప్రతికూల వాతావరణం, భారీ వర్షాలు ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నట్లు తెలిపారు. సైనిక బృందాలు, అస్సాం రైఫిల్స్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 13 మంది జవాన్లను, ఐదుగురు పౌరులను సహాయక సిబ్బంది రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు