Published : 08/01/2021 01:15 IST

కరోనాతో వారికి అధిక ముప్పే..!

పారిస్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువగా ఇదివరకు ఆరోగ్య సమస్యలు(కోమార్బిడిటీ) ఎదుర్కొంటున్న వారే అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా, తీవ్ర హృద్రోగ సమస్యలున్న వారికి కరోనా సోకితే ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుందని తాజాగా యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ(ఈఎస్‌సీ)కి చెందిన పరిశోధకులు స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి రోగులు కరోనా బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

పరిశోధనలో భాగంగా ఇంగ్లండ్‌లోని నార్త్‌ బ్రిస్టాల్‌ ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో చేరిన 283 మంది హృద్రోగ సమస్యలున్న రోగుల ఆరోగ్యాన్ని విశ్లేషించారు. వీరిలో చికిత్స మూడో వంతు రోగులను ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా కరోనా విజృంభణ కంటే ముందు చేరిన రోగుల పరిస్థితి, లాక్‌డౌన్‌ కాలంలో ఆసుపత్రుల్లో చేరిన రోగుల ఆరోగ్యాన్ని సమీక్షించారు. వీరిలో కరోనా సమయంలో చేరిన రోగుల్లో ఎక్కువమంది 30రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు గుర్తించారు. కరోనా ముందు చేరిన రోగుల్లో దాదాపు 11శాతం మంది 30రోజుల్లో మృత్యువాతపడగా, కరోనా విజృంభణ సమయంలో దాదాపు 21శాతం రోగులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. అయితే ఇలా మరణాలు సంభవించడానికి గల కారణాలను విశ్లేషించారు. చివరకు, హృద్రోగ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన కొవిడ్‌ రోగుల్లోనే ఎక్కువ మంది చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే, ఈ పరిశోధనను కేవలం ఈ ఒక్క కేంద్రంలోనే జరిపామని, వీటిని కచ్చితంగా అంచనా వేసేందుకు వీటని మరిన్ని కేంద్రాల్లో జరపాల్సిన అవసరాన్ని పరిశోధకులు నొక్కిచెప్పారు.

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత గుండె పనితీరు దెబ్బతిన్న రోగులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాన్ని తాజా నివేదిక తెలియజేస్తోందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ అమర్‌దీప్‌ దస్తీదార్‌ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇలాంటి అధిక ప్రమాదమున్న అన్ని వయసుల వారికి వ్యాక్సిన్‌ అందించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా వారికి ఎప్పటికప్పుడు కొవిడ్‌ పరీక్షలు జరపడంతో పాటు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోస ఇబ్బందులు, అలసట, కాళ్ల వాపులు వంటి లక్షణాలు గుండె పనితీరు క్షీణిస్తున్నట్లు సూచిస్తాయి. ఇవి మరింత తీవ్రమవడాన్నే తీవ్ర హృద్రోగ సమస్యగా పరిగణిస్తారు. ఇలాంటి సమయంలో ఐసీయూలో అత్యవసర చికిత్స అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఇలాంటి రోగులు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి..
8నెలల పాటు యాంటీబాడీలు..!
కొవిడ్‌ టీకా: ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుందంటే..!

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని