Published : 18 Jul 2021 22:25 IST

Maharashtra: 31కి చేరిన మృతుల సంఖ్య

ముంబయి: మహారాష్ట్రలోని చెంబూరు, విఖ్రోలిలో గోడలు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరింది. చెంబూరులో జరిగిన ఘటనలో మంది మృతి చెందినవారి సంఖ్య 21కి చేరగా.. విఖ్రోలిలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ముంబయిలో రానున్న 24 గంటలను ప్రభుత్వం రెడ్‌ అలెర్ట్‌గా ప్రకటించింది. ఈ ఘటనలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం తనయుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే వరదలకు కొట్టుకుపోయిన మూడు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి ప్రజలను పరామర్శించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

17వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కొండచరియలు విరిగిపడటంతో గోడలు కూలాయని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం పేర్కొంది. ఇప్పటికే బృందంలోని సిబ్బంది గోడ కింద చిక్కుకున్న పలువురిని కాపాడారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు. చెంబూరులో ఒంటిగంట సమయంలో, విఖ్రోలిలో అర్ధరాత్రి 2.30 సమయంలో గోడలు కూలాయి. ముంబయి నగరాన్ని భారీ వరదలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బోరివాలిలో పార్కింగ్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. చాలాచోట్ల పట్టాలపై నీరు నిలవడంతో సెంట్రల్‌, వెస్టర్న్‌ రైల్వే సంస్థలు సర్వీసులను నిలిపివేశాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని