అరాచక పాలనకు 300 మందికి పైగా బలి

మయన్మార్‌లో ఆందోళనకారులపై సైన్యం అణచివేత ధోరణి కొనసాగుతోంది. ఇప్పటివరకు 300 మందికిపైగా నిరసనకారులను సైనిక ప్రభుత్వం హతమార్చిందని అక్కడి న్యాయవాదులు, మీడియా విడుదల చేసిన డేటాలో తేలింది....

Published : 26 Mar 2021 23:53 IST

మయన్మార్‌లో కొనసాగుతున్న సైనిక హింస

యాంగూన్‌: మయన్మార్‌లో ఆందోళనకారులపై సైన్యం అణచివేత ధోరణి కొనసాగుతోంది. ఇప్పటివరకు 300 మందికిపైగా నిరసనకారులను సైనిక ప్రభుత్వం హతమార్చిందని అక్కడి న్యాయవాదులు, మీడియా విడుదల చేసిన డేటాలో తేలింది. వారిలో తుపాకీతో కాల్చడం వల్లే 90 శాతం మృతి చెందారని డేటా వివరించింది. మృతుల్లో 90 శాతం మంది పురుషులేనని, అందులో 34 శాతం మంది 24 ఏళ్లులోపు వయసు వారని డేటా స్పష్టం చేసింది. మార్చి 25 నాటికి 320 మంది మరణించినట్లు ఏఏపీపీ గ్రూపు వెల్లడించింది. మూడు వేల మందిని సైనిక ప్రభుత్వం అరెస్టు చేసిందని పేర్కొంది. 

అయితే ఆందోళనలలో 164 మంది నిరసనకారులు, తొమ్మిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు సైనిక ప్రభుత్వ తరఫు ప్రతినిధి పేర్కొన్నారు. మయన్మార్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సైన్యం.. పాలనను తమ చేతుల్లోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ ప్రజలు పెద్దఎత్తున నిరసన చేపడుతున్నారు. ఆ నిరసనలను అణచివేసేందుకు సైన్యం వారిపై తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని