Updated : 08/08/2020 09:51 IST

కొలికోడ్‌ ప్రమాదం.. 19కి చేరిన మృతుల సంఖ్య

కొలికోడ్‌ :  కేరళలోని కొలికోడ్‌ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరినట్లు పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు. కొలికోడ్ చుట్టుపక్కల 13 వేర్వేరు ఆసుపత్రుల్లో 171 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో గర్భిణీ స్త్రీ, నలుగురు పిల్లలతో సహా మొత్తం 23 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విమాన ప్రమాదంలో మరణించిన 19 మందిలో 18 మందిని గుర్తించగా.. ఇంకొకరిని గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.  మృతులకు  కోవిడ్ -19 ప్రొటోకాల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం పోస్ట్‌మార్టం చేయనున్నారు. 

గమ్యస్థానానికి చేరుకున్న ‘ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌’ విమానం అనూహ్యంగా అదుపుతప్పి, 35 అడుగుల లోయలో పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానం రెండు ముక్కలైంది. విమానంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది చిన్నారులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

మరోవైపు విమాన ప్రమాదంపై రెండు విచారణ బృందాలను కేంద్రం నియమించింది. వీటిలో ఒక బృందం కొలికోడ్ చేరుకోగా.. మధ్యాహ్నం 2 గంటలకు మరో బృందం రానున్నట్లు పౌర విమానయాన వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ ఇండియా నియమించిన విచారణ బృందం ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి.. విమానం నుంచి బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకోనుంది. ఘటనకు గల కారణాలు అన్వేషించనుంది.

ఘటనాస్థలికి కేరళ సీఎం
విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మరికాసేపట్లో కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ సందర్శించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 
కేంద్ర మంత్రి మురళీధరన్ ఇప్పటికే ప్రమాద స్థలానికి చేరుకుని.. ప్రమాదం గురించి అధికారులతో చర్చించారు. 

ఈ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది. ప్రయాణికుల బంధువులు సంప్రదించేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్‌(0495-2376901) ఏర్పాటు చేసినట్లు కొలికోడ్‌ కలెక్టర్‌ తెలిపారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని