Carl Gustaf M4: భారత్‌లో కార్ల్‌ గుస్తాఫ్‌ ఆయుధ వ్యవస్థల తయారీ..!

స్వీడిష్‌కు చెందిన అత్యున్నత శ్రేణి రక్షణ రంగ సంస్థ ‘సాబ్‌’ భారత్‌లో తయారీని ప్రారంభించనుంది. ఈ విషయాన్ని ఆ కంపెనీకి చెందిన సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గోర్జెన్‌ జాన్సన్‌ ధ్రువీకరించారు.

Updated : 27 Sep 2022 19:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్వీడన్‌కు చెందిన అత్యున్నత శ్రేణి రక్షణ రంగ సంస్థ ‘సాబ్‌’ భారత్‌లో తయారీని ప్రారంభించనుంది. ఈ విషయాన్ని ఆ కంపెనీకి చెందిన సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గోర్జెన్‌ జాన్సన్‌ ధ్రువీకరించారు. ఇప్పటి వరకు ఈ సంస్థ మరే దేశంలోనూ తయారీ విభాగాలను ఏర్పాటు చేయలేదు. ఈ తయారీ విభాగంలో కార్ల్‌ గుస్టాఫ్‌ ఎం4 ఆయుధ వ్యవస్థలను నిర్మించనున్నారు. 2024 నుంచి వీటిని తయారీ ప్రారంభమవుతుందని జాన్సన్‌ పేర్కొన్నారు.

ఈ రికాయిలెస్‌ రైఫిల్‌ను అవసరాన్ని పలు సందర్భాల్లో వినియోగించవచ్చు. ఏడు కిలోల బరువుండి సుమారు ఒక మీటరు పొడవు ఉంటుంది. దీనికి అత్యాధునిక టెలిస్కోప్‌ అమర్చి ఉండటంతో లక్ష్యాన్ని కచ్చితంగా గుర్తించవచ్చు. ఈ వ్యవస్థలో అత్యాధునిక ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థలు కూడా ఉన్నాయి. వాహనాలు, నిర్మాణాలను ధ్వంసం చేయడానికి ఎం4ను వినియోగిస్తారు.

భారత్‌ ఇప్పటికే రక్షణ రంగంలో మూడు రకాల పాజిటీవ్‌ లిస్ట్‌లను విడుదల చేసింది. దాదాపు 1000కు పైగా పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు విధించింది. కొత్త నిబంధనల ప్రకారం భారత్‌ తయారు చేయడం కానీ, దేశీయంగా తయారైన అత్యధిక విడిభాగాలను కానీ కచ్చితంగా వినియోగించాల్సి ఉంది. ఈ జాబితాలో ట్యాంక్‌ విధ్వంసక క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాబ్‌ భారత్‌లో తయారీ ఆరంభిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని