Agnipath: అగ్నిపథ్‌ పథకంపై రాజ్‌నాథ్‌ సమీక్ష.. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌లతో భేటీ

సాయుధ బలగాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై దేశవ్యాప్తంగా ఉద్రిక్త ఆందోళనల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ అప్రమత్తమైంది. ఈ పథకంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారం

Updated : 18 Jun 2022 13:25 IST

దిల్లీ: సాయుధ బలగాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై దేశవ్యాప్తంగా ఉద్రిక్త ఆందోళనల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ అప్రమత్తమైంది. ఈ పథకంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారం సమీక్ష చేపట్టారు. తన నివాసంలో నేవీ చీఫ్‌ అడ్మిరల్ ఆర్‌ హరి, వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సైనిక విభాగాల అధికారులు కూడా పాల్గొన్నారు.

ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే కూడా ఈ భేటీలో పాల్గొనాల్సి ఉండగా.. ఆయన ప్రస్తుతం దిల్లీలో లేరని తెలిసింది. ఆయన స్థానంలో వైస్ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ బీఎస్‌ రాజు సమావేశంలో పాల్గొన్నారు. అగ్నిపథ్‌ను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనలపై ఈ భేటీలో రాజ్‌నాథ్‌ చర్చించినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఉద్రిక్తతలను తగ్గించేలా చేపట్టాల్సిన చర్యలపై కేంద్రమంత్రి చర్చించినట్లు తెలుస్తోంది.

అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం నేడు మరో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద సైన్యంలో పనిచేసిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు హోంశాఖ నేడు ప్రకటించింది. అంతేగాక, ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయో పరిమితిలోనూ అగ్నివీరులకు సడలింపు కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని