
Rajnath Singh: తొలిసారి జలాంతర్గామిలో రాజ్‌నాథ్ సింగ్.. నౌకాదళ సామర్థ్యాల ప్రత్యక్ష పరిశీలన
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలిసారి జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకదళ స్థావరం నుంచి కల్వరి క్లాస్ ‘ఐఎన్ఎస్ ఖండేరీ’లో శుక్రవారం ఆయన సముద్రయానం చేశారు. ఐఎన్ఎస్ ఖండేరీ ప్రయాణంలో అద్భుతమైన, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగిందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సబ్‌మెరైన్ సిబ్బందితో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. ‘సముద్రపు అడుగున గంటల తరబడి గడిపా. అత్యాధునిక కల్వరి క్లాస్ సబ్‌మెరైన్ పోరాట సామర్థ్యాలను గమనించాన’ని పేర్కొన్నారు. నీటి అడుగున భారత నావికాదళం సామర్థ్యాలను మొదటిసారి ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి.. దేశ భద్రతపై తనకు భరోసా ఉందని వ్యాఖ్యానించారు.
‘భారత నావికాదళం.. ఆధునిక, శక్తిమంతమైన, విశ్వసనీయ శక్తి. ఇది అన్ని పరిస్థితుల్లోనూ అప్రమత్తంగా, పరాక్రమంగా, విజేతగా ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. నౌకాదళం చేస్తున్న సన్నాహాలు.. ఎలాంటి దురాక్రమణలను రెచ్చగొట్టేందుకు కాదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి భద్రతల నిర్వహణ కోసమేన’ని మంత్రి పేర్కొన్నారు. రాజ్‌నాథ్ గతంలో యుద్ధ, నిఘా విమానాలు, యుద్ధ నౌకల్లో ప్రయాణించారని.. అయితే జలాంతర్గామిలో ప్రయాణం ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్వార్ నౌకదళ స్థావరంలో ‘ప్రాజెక్ట్ సీ బర్డ్’ కింద చేపడుతోన్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించేందుకు గురువారం మంత్రి ఇక్కడికి చేరుకున్నారు. ఏడాది వ్యవధిలో ఇది రెండో సందర్శన. గతేడాది జూన్ 24న సైతం నేవల్ బేస్‌లోని ప్రాజెక్ట్ ప్రాంతాలు, స్థలాలను ఆయన ఏరియల్ సర్వే చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: సీఎం జగన్ పీఏ పేరుతో మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఫేక్ మెసేజ్
-
Movies News
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
-
General News
urine color: మూత్రం రంగు మారుతోందా..ఓసారి పరీక్ష చేయించుకోండి!
-
Politics News
Komatireddy: భూములిచ్చిన రైతులకు బేడీలా? కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: కోమటిరెడ్డి
-
Sports News
T20 World Cup: టీమ్ఇండియాకు షాకేనా..? టీ20 ప్రపంచకప్ జట్టులో షమి లేనట్టేనా..?
-
Movies News
Social Look: రెజీనా ‘లైఫ్’ క్యాప్షన్.. కట్టిపడేసేలా జాక్వెలిన్ ‘రెడ్’లుక్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్