
Rajnath Singh: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా..
దిల్లీ: ఒమిక్రాన్ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. గత కొన్ని రోజులుగా అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకుని ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు.
ఐదు రోజుల క్రితం రాజ్‌నాథ్.. వాయుసేన అధికారులతో సమావేశమైన విషయం తెలిసిందే. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఐఏఎఫ్ చీఫ్.. రాజ్‌నాథ్‌ను కలిసి నివేదిక సమర్పించారు.
ఇటీవల కేంద్రమంత్రులు భారతి పవార్, మహేంద్ర నాథ్ పాండే, నిత్యానంద్ రాయ్‌లతో పాటు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, భాజపా ఎంపీలు మనోజ్ తివారీ, వరుణ్ గాంధీ తదితరులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ కొత్త కేసులు పెరుగుతుండగా.. నిన్న ఒక్కరోజే 22వేలకు పైగా మందికి పాజిటివ్‌గా తేలింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.