Arvind Kejriwal: అసలైన అవినీతి ఏంటో ఈ రోజు చూస్తారు: అరవింద్‌ కేజ్రీవాల్‌

నగదు అక్రమ చెలామణీ కేసులో రాష్ట్ర మంత్రి సత్యేంద్ర అరెస్టు విషయంలో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్ తాజాగా మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘జైన్‌ నిందితుడు కాదు. ఆయన్ను ప్రశ్నిస్తున్నాం: ఈడీ’ అనే ఓ...

Published : 05 Jun 2022 02:34 IST

దిల్లీ: నగదు అక్రమ చెలామణీ కేసులో రాష్ట్ర మంత్రి సత్యేంద్ర అరెస్టు విషయంలో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్ తాజాగా మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘జైన్‌ నిందితుడు కాదు. ఆయన్ను ప్రశ్నిస్తున్నాం: ఈడీ’ అనే ఓ వార్తాకథనాన్ని ఉటంకిస్తూ.. ‘జైన్‌ నిందితుడు కాదని కేంద్ర ప్రభుత్వమే కోర్టులో తెలిపింది. అసలు నిందితుడే కానప్పుడు.. ఆయన అవినీతిపరుడు ఎలా అవుతారు?’ అంటూ ట్వీట్‌ చేశారు. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా నేడు భాజపాకు చెందిన ఓ బడా నేత చిట్టా విప్పనున్నట్లు తెలిపారు. నిజమైన అవినీతి ఎలా ఉంటుంది? పెద్ద అవినీతిపరుడు ఎలా కనిపిస్తారు? అన్న విషయాన్ని ఆయన బహిర్గతం చేస్తారని చెప్పారు.

ఇదిలా ఉండగా.. మే 30న మనీలాండరింగ్ కేసులో జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది కాస్తా.. కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరో వివాదానికి దారితీసింది. త్వరలో మనీశ్‌ సిసోదియాను అరెస్టు చేసేందుకు కుట్ర జరుగుతోందని కేజ్రీవాల్‌ ఇటీవల ఆరోపించారు. ఆయన్ను తప్పుడు కేసుల్లో ఇరికించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలోని అన్ని సంస్థలను ఆదేశించిందని చెప్పారు. ఆప్‌ ఎమ్మెల్యేలు, మంత్రులను ఒక్కొక్కరిగా కాకుండా.. అందర్నీ ఒకేసారి జైల్లో వేయాలని.. ప్రధాని మోదీకి కాస్త వ్యంగ్యంగా విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని