Lancet Report: తీవ్ర గుండెపోటు కేసుల్లో.. మరణాలకు ప్రధాన కారణం అదే!
తీవ్ర హృద్రోగ సమస్యలు (Heart Attack), స్ట్రోక్ వచ్చిన సందర్భాల్లో సరైన చికిత్సలో జాప్యమే మరణాలకు ప్రధాన కారణమని.. కేవలం కొంతమంది మాత్రమే సరైన సమయంలో వైద్యులను సంప్రదిస్తున్నారని తాజా అధ్యయనం (The Lancet) వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: తీవ్ర హృద్రోగ సమస్యలు (Heart Attack), స్ట్రోక్ వచ్చిన సందర్భాల్లో సరైన చికిత్సలో జాప్యమే మరణాలకు ప్రధాన కారణమని తాజా నివేదిక వెల్లడించింది. కేవలం కొందరు బాధితులు మాత్రమే అత్యవసర చికిత్స కోసం సకాలంలో ఆస్పత్రులను సంప్రదిస్తున్నారని పేర్కొంది. ఆస్పత్రికి చేరుకునే జాప్యాన్ని వివిధ స్థాయిలో పరిష్కరించినట్లయితే హృద్రోగ మరణాలను (Early Deaths) నివారించవచ్చని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో జరిపిన అధ్యయన నివేదికను ‘ది లాన్సెట్’ జర్నల్ ప్రచురించింది.
‘స్ట్రోక్‌తోపాటు గుండెకు సంబంధించి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రతికూల ఫలితానికి కారణమవుతుంది. జాప్యం చేయడం వల్ల అత్యంత ముఖ్యమైన థెరపీలు అందకపోవడంతో ఫలితం మారిపోతుంది. తీవ్ర గుండెపోటు కేసుల్లో (Myocardial Infarction) జాప్యం లేకుండా సరైన సమయంలో చికిత్స అందించినట్లయితే మరణం ముప్పును 30శాతం తగ్గించవచ్చు’ అని తాజా నివేదిక వెల్లడించింది.
ఉత్తరాదిలో గుండెపోటు/ స్ట్రోక్ మరణాలు, అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు అవసరమైన చికిత్సలో జాప్యానికి గల కారణాలపై భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) నేతృత్వంలో ఎయిమ్స్ నిపుణులు ఓ అధ్యయనం జరిపారు. 2020-21 మధ్య కాలంలో హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లాలోని రెండు తహశీల్ ప్రాంతాల్లో ఈ అధ్యయనం చేశారు. ఇదే సమయంలో జిల్లాలో గుండెపోటుతో మరణించిన వారి పూర్తి వివరాలను సేకరించారు. అత్యవసర పరిస్థితుల్లో జాప్యానికి మూడు కారణాలుగా వర్గీకరించి పరిశీలించారు.
- మొత్తం 435 మరణాల్లో 38.4 శాతం మంది తీవ్రతను గుర్తించకపోవడం, ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సరైన వాహన సదుపాయాలు లేకపోవడంతో 20 శాతం మంది, మరో 10.8 శాతం మందికి ఆర్థిక స్తోమత లేకపోవడం వంటివి అత్యవసర చికిత్సకు జాప్యంగా కనిపించాయి.
- గుండెపోటుతో చనిపోయిన వారిలో కేవలం 10.8 శాతం మంది మాత్రమే లక్షణాలు మొదలైన గంటలోపు ఆస్పత్రికి చేరుకున్నారు.
- అధ్యయనంలో భాగంగా 2466 శవపరీక్షల నివేదికలను పరిశీలించారు. అందులో 761 (30శాతం) హృద్రోగ సంబంధమైనవేనని గుర్తించారు.
- గుండెపోటు లేదా స్ట్రోక్‌కు సంబంధించిన లక్షణాలపై అవగాహన లేకపోవడంతో వాటి తీవ్రతను గుర్తించలేకపోవడం ఈ జాప్యానికి ప్రధాన కారణమని అన్ని పరిశీలనల్లో గుర్తించినట్లు తాజా అధ్యయనం పేర్కొంది.
- పౌరులతోపాటు ఆరోగ్య వ్యవస్థలో వివిధ స్థాయిలోనూ ఇటువంటి అత్యవసర పరిస్థితులపై అవగాహన పెంచాలని తాజా అధ్యయనం తెలుపుతోంది.
- అంబులెన్సులను సమర్థంగా వినియోగించుకోవడం కూడా ముఖ్యమే. లక్షణాలను గుర్తించిన వెంటనే సంబంధిత ఆస్పత్రికి సిఫార్సు చేయడంపైనా ప్రాథమిక ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి.
- ఇటువంటి ప్రాణాపాయం ముప్పు వాటికోసం ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకోవడంతోపాటు గుండెపోటు, స్ట్రోక్ లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన