Delhi: దిల్లీ పోలీసులపై కరోనా పంజా.. ఇప్పటివరకు 1700 మందికి పాజిటివ్‌

దేశ రాజధాని దిల్లీలో పోలీసు సిబ్బందిపై కరోనా మహమ్మారి కొమ్ములు విదిలిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి తర్వాత నుంచి దిల్లీలో వందల మంది పోలీసులు వైరస్‌

Published : 12 Jan 2022 22:29 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో పోలీసు సిబ్బందిపై కరోనా మహమ్మారి కొమ్ములు విదిలిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి తర్వాత నుంచి దిల్లీలో వందల మంది పోలీసులు వైరస్‌ బారినపడుతున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు 1700 మందికి కొవిడ్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. 

‘‘జనవరి 1 నుంచి నేటి వరకు మొత్తంగా 1700 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వీరంతా క్వారంటైన్‌లో ఉన్నారు. వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి విధుల్లో చేరతారు’’ అని సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించారు. ఇక పోలీసు సిబ్బంది ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్‌ డోసు వేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం దిల్లీ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక క్యాంప్‌ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

ముంబయిలో ఒక్కరోజే 120 మంది పోలీసులకు కరోనా

అటు మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి తర్వాత ఆ రాష్ట్రంలోనూ వందల సంఖ్యలో పోలీసులకు వైరస్‌ సోకింది. ముంబయిలో నిన్న ఒక్కరోజే 120 మంది పోలీసులకు పాజిటివ్‌గా తేలడం గమనార్హం. పోలీసు విభాగంలో ప్రస్తుతం 600లకు పైగా యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక ముంబయిలో ఇప్పటివరకు 125 మంది పోలీసులను కొవిడ్‌ బలితీసుకుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ గణాంకాలు పేర్కొన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని