SpiceJet: గాల్లో ఉండగా విమానంలో మంటలు.. స్పైస్‌జెట్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌

స్పైస్‌జెట్‌ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పట్నా నుంచి దిల్లీ బయలుదేరిన విమానంలో మంటలు అంటుకోవడం కలకలం రేపింది.

Updated : 19 Jun 2022 14:49 IST

దిల్లీ: స్పైస్‌జెట్‌ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పట్నా నుంచి దిల్లీ బయలుదేరిన విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఒక్కసారిగా మంటలు అంటుకోవడం కలకలం రేపింది. పట్నా విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ ఐన కొద్ది సేపటికే విమానం ఎడమ ఇంజిన్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో ఇంజిన్‌లో స్వల్పంగా మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు.. విమానాన్ని తిరిగి పట్నా విమానాశ్రయంలో అత్యవరసర ల్యాండింగ్‌ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

దీనిపై స్పందించిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA).. పక్షి ఢీ కొట్టడం వల్లే మంటలు వచ్చినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని గ్రహించిన వెంటనే ఇంజిన్‌ను ఆపేసిన పైలట్లు.. విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్‌ చేసినట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు