Updated : 24 May 2022 17:46 IST

Kejriwal: ఈ-బస్సులు మీవే.. జాగ్రత్త! ఈ మూడ్రోజులు ఉచిత ప్రయాణం!

150 బస్సులను పచ్చజెండా ఊపి ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్‌

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్‌ బస్సులు రోడ్డెక్కాయి. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మంగళవారం 150 విద్యుత్‌ బస్సులను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఏడాదిలో 2000 ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. రాబోయే పదేళ్లలో ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం రూ.1862 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఈ-బస్సులో ఆయన ప్రయాణించారు. ఈసందర్భంగా కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు 150 బస్సులను ప్రారంభించాం. మరో 150 వచ్చే నెలలో వస్తాయి. ఈ బస్సులన్నీ మీవి. జాగ్రత్తగా చూసుకోండి. వాటిని మురికిగా చేసుకోవద్దు. ఈ బస్సులు దిల్లీలో కాలుష్యాన్ని తగ్గిస్తాయి’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కాలుష్యం తగ్గించే ఉద్దేశంతో తీసుకొస్తున్న ఈ బస్సుల కోసం దిల్లీ ప్రభుత్వం రూ. 1862 కోట్లు కేటాయించగా.. కేంద్రం కూడా రూ.150 కోట్లు సమకూర్చింది. 

మూడు రోజులు ఫ్రీగా ప్రయాణించేందుకు ప్రజలకు అవకాశం!
ఈ-బస్సుల కోసం నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ కృజ్ఞతలు తెలిపారు. దీంట్లో కేంద్రానికీ క్రెడిట్ ఇచ్చినట్టు తెలిపారు. ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీకి సమయం పడుతున్నందున 600-700 సీఎన్‌జీ బస్సులను కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇంద్రప్రస్థ డిపో వద్ద బస్సులను ప్రారంభించిన కేజ్రీవాల్‌.. ఓ బస్సెక్కి రాజ్‌ఘాట్‌ క్లస్టర్‌ బస్సు డిపో వరకు ప్రయాణం చేశారు. ఆయనతో పాటు దిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాష్‌ గహ్లోత్‌, సీఎస్‌ నరేష్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.  అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఉన్నప్పుడు తరచూ బస్సుల్లో తిరిగిన సందర్భాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఈ రోజ నుంచి ఈనెల 26వరకు ప్రజలు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని అందిస్తున్నట్టు కేజ్రీవాల్‌ వెల్లడించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని