AAP vs BJP: అవినీతితో ఊపిరాడలేదు.. అందుకే ఆప్‌ను వీడా..!

దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త మేయర్ వచ్చిన రెండు రోజుల వ్యవధిలోనే ఆప్‌(AAP)కు షాక్‌ తగిలింది. ఒక కౌన్సిలర్‌ భాజపాలో చేరారు. 

Published : 24 Feb 2023 11:35 IST

దిల్లీ: దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికలు(MCD Elections) మొదలైన దగ్గరి నుంచి రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటోంది. దిల్లీ మేయర్‌ ఎన్నికపై రగడ ముగిసి.. ఎట్టకేలకు కొత్త మేయర్ వచ్చారు. బుధవారం స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక కోసం జరిగిన ఎంసీడీ సమావేశం.. రణక్షేత్రంగా మారింది. ఇది జరిగిన గంటల వ్యవధిలో ఓ కౌన్సిలర్ ఆప్‌ను వీడి భాజపాలో చేరారు. 

బవానాకు చెందిన కౌన్సిలర్ పవన్‌ షెహ్రావత్‌(Pawan Sehrawat) ఆప్‌ను వీడుతూ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలోని అవినీతితో ఊపిరాడలేదని ఆరోపించారు. అలాగే ఎంసీడీ కార్యాలయంలో రచ్చ చేయాలని కౌన్సిలర్లకు సూచనలు వచ్చాయని, దానిపై తాను తీవ్ర ఆవేదనకు గురైనట్లు వెల్లడించారు. తాజాగా ఆయన దిల్లీలో భాజపాలో చేరారు. 

ఇదిలా ఉంటే.. స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక కోసం బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జరిగిన ఎంసీడీ(MCD) సమావేశం కురుక్షేత్రాన్ని తలపించింది. బ్యాలెట్ బాక్సులు, బాటిళ్లు ఎగిరిపడ్డాయి. కౌన్సిలర్లు పరస్పరం నెట్టుకున్నారు. చేతులతో కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. దాంతో ఆ రోజు ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయి.. శుక్రవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని