హోదాలో ఉన్న వ్యక్తి.. వేధించడని చెప్పలేం

కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌ వేసిన పరువు నష్టం కేసులో ప్రముఖ విలేకరి ప్రియా రమణి నిర్దోషిగా తేలారు. ఈ కేసులో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి అభియోగాలు రుజువు కాకపోవడంతో కేసును

Updated : 17 Feb 2021 16:38 IST

ఎంజే అక్బర్‌ పరువునష్టం కేసు: ప్రియారమణి నిర్దోషి

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌ వేసిన పరువు నష్టం కేసులో ప్రముఖ విలేకరి ప్రియా రమణి నిర్దోషిగా తేలారు. ఈ కేసులో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి అభియోగాలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు దిల్లీ అదనపు చీఫ్‌ మెట్రోపొలిటన్‌ మెజిస్ట్రేట్‌ రవీంద్ర కుమార్‌ బుధవారం తీర్పు వెలువరించారు. 

ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘లైంగిక వేధింపుల వల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. వారి మర్యాదకు భంగం కలుగుతుంది. మహిళ తాను ఎదుర్కొన్న సమస్యలపై దశాబ్దాల తర్వాత కూడా ఫిర్యాదు చేసే హక్కు వారికి ఉంటుంది. సమాజంలో ఉన్న పెద్ద మనిషి.. లైంగికంగా వేధించడని చెప్పలేం. ఆ ఉన్నత వ్యక్తి పరువు కోసం మరో వ్యక్తి మర్యాదను తాకట్టుగా పెట్టలేం’’ అని న్యాయమూర్తి తెలిపారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై కూడా కోర్టు విచారం వ్యక్తం చేసింది. ఆడవాళ్లను గౌరవించాలని చెబుతూ రామాయణం, మహాభారతం లాంటి పవిత్ర గ్రంథాలను రాసిన నేలపైనే మహిళలపై దారుణాలు జరుగుతుండటం అవమానకరమని కోర్టు తెలిపింది. 

2018లో ప్రపంచవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉద్ధృతంగా జరిగిన సమయంలో జర్నలిస్టు ప్రియారమణి.. అప్పటి కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె తర్వాత పలువురు మహిళా విలేకరులు కూడా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే వీటిని ఖండించిన ఎంజే అక్బర్‌.. ప్రియా రమణిపై 2018 అక్టోబరులో పరువు నష్టం కేసు వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో నేడు తీర్పు వెలువడింది. అయితే ఆరోపణల నేపథ్యంలో గతంలోనే ఎంజే అక్బర్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని