Kejriwal: ‘కేసులు పెరుగుతున్నా.. భయపడాల్సిన పనిలేదు’

దేశ రాజధాని దిల్లీలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని.. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు......

Published : 15 Jan 2022 01:47 IST

దిల్లీ: దేశ రాజధానిలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని.. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. వైరస్‌ కారణంగా ఆసుపత్రుల్లో చేరికలు, మరణాల రేటు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. అన్ని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచామని.. కావాల్సినన్ని పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అయితే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.

‘తీవ్ర వ్యాప్తిగల ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయినా భయపడాల్సిన పనిలేదు. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నాయి. అత్యవసర సమయాల్లో అవసరమయ్యే అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాం’ అని విలేకర్ల సమావేశంలో కేజ్రీవాల్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని