Delhi: కొత్త విధానం వచ్చే వరకు పాత విధానమే.. దిల్లీలో మద్యం పాలసీ మరో ఆరు నెలలు పొడిగింపు

సెప్టెంబరు 30తో పాత మద్యం పాలసీ (Liquor Policy) ముగియనుండటంతో దిల్లీ ప్రభుత్వం దానిని మరో ఆరు నెలలు పొడిగించింది.

Updated : 28 Sep 2023 15:53 IST

దిల్లీ : దిల్లీ (Delhi) ప్రభుత్వం మద్యం పాలసీ (Liquor Policy)ను మరోసారి పొడిగించింది. గతేడాది దిల్లీ ప్రభుత్వం నూతన ఎక్సైజ్‌ విధానాన్ని (Excise Policy) రద్దు చేసి పాత మద్యం పాలసీ విధానాన్ని తిరిగి అమలులోకి తెచ్చింది. ఈ పాలసీ మార్చి 31, 2023 తో ముగియడంతో దిల్లీ ప్రభుత్వం దానిని సెప్టెంబరు 30 తో వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది కూడా గడువు ముగియనుండటంతో మరో ఆరు నెలలు పొడిగించింది.

దిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని రూపొందించి అమలు చేసేవరకు పాత పాలసీనే కొనసాగనుంది. ఇందుకు త్వరగా కొత్త మద్యం పాలసీని రూపొందించాలని ఎక్సైజ్‌ శాఖను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేగాక, ప్రభుత్వ అధీనంలో ఉన్న ఏజెన్సీలు మాత్రమే మద్యం దుకాణాలను నిర్వహిస్తారు.

ఆగస్టులో మద్యం దుకాణాలను, రెస్టారెంట్లను, క్లబ్‌లు, హోటళ్లను నడుపుతున్న యజమానులు, కంపెనీ భాగస్వాములు అనుమతి పత్రాలను ఎక్సైజ్‌ శాఖ కు అందించడం తప్పనిసరి చేసింది. దీనివల్ల లైసెన్స్‌ ఉన్న వ్యక్తులు, నేర చరిత్ర లేని వారు మాత్రమే మద్యం దుకాణాలను నడిపే అవకాశం ఉంటుంది. నగరంలో ఇప్పటివరకు  970 మందికి పైగా హెచ్‌సీఆర్‌ (HCR category) కేటగిరీ లైసెన్స్‌ దారులు ఉన్నారు. 400 మంది లైసెన్స్ వెరిఫికేషన్ కోసం పోలీసులను ఆశ్రయించినట్లు బార్ల యజమానులు మీడియాకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని