Night curfew: కొవిడ్‌ కేసులు జంప్‌.. దిల్లీలో నైట్‌ కర్ఫ్యూ

దేశ రాజధాని దిల్లీలో సోమవారం నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.

Published : 26 Dec 2021 21:40 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో సోమవారం నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. దిల్లీలో కొవిడ్‌ కేసుల పెరగడంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 290 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఒకరు మృతి చెందారు. ఒమిక్రాన్‌ భయాల వేళ పాజిటివిటీ రేటు సైతం 0.55 శాతం మేర పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా కేసులు కలుపుకొని దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 14,43,352కు చేరగా.. మరణాల సంఖ్య 25,105కి పెరిగింది. దిల్లీలో ఇప్పటి వరకు 79 ఒమిక్రాన్‌ కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు