Manish Sisodia: ఆరోపణలు తీవ్రమైనవి.. బెయిల్‌ ఇవ్వలేం : సిసోదియాకు హైకోర్టు షాక్‌

Excise policy scam: మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోదియాకు బెయిల్ ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆయనపై ఆరోపణలు చాలా తీవ్రమైనవని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

Updated : 30 May 2023 13:20 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (Delhi liquor scam) కేసులో అరెస్టయిన ఆప్‌ (AAP) నేత, దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish sisodia)కు దిల్లీ హైకోర్టు (Delhi HC)లో చుక్కెదురైంది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి దినేశ్ కుమార్‌ శర్మ మంగళవారం ఉదయం తీర్పు వెలువరించారు. సిసోదియాపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపింది. అందువల్ల ఆయనకు బెయిల్‌ ఇవ్వలేమని న్యాయస్థానం వెల్లడించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బెయిల్‌ కోసం సిసోదియా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ (CBI) అధికారులు సిసోదియా (Manish Sisodia)ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. తొలుత న్యాయస్థానం సీబీఐ కస్టడికి అప్పగించింది. అనంతరం జ్యుడిషియల్‌ కస్టడీ విధించడంతో ఆయనను తిహాడ్‌ జైలుకు తరలించారు. ఇటీవల ఆయన కస్టడీని దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు జూన్‌ 1వ తేదీ వరకు పొడగించింది. అయితే జైల్లో ఆయనకు కుర్చీ, టేబుల్‌, పుస్తకాలు అందించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. కాగా.. ఈ కేసులో అటు ఈడీ కూడా సిసోదియాపై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకుంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు