Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. బెయిల్‌పై హైకోర్టు స్టే

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ట్రయల్‌ కోర్టు మంజూరుచేసిన బెయిల్‌పై హైకోర్టు మంగళవారం స్టే విధించింది.

Published : 25 Jun 2024 16:29 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో బెయిల్‌పై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు దిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ట్రయల్‌ కోర్టు మంజూరుచేసిన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈడీ సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకోవడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని, బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తిస్థాయిలో ఆలోచన చేయలేదని పేర్కొంది. బెయిల్‌పై విచారణ సమయంలో ఈడీకి తగిన అవకాశం ఇవ్వాల్సిందని చెప్పింది. దీంతో కేజ్రీవాల్‌ ప్రస్తుతానికి తిహాడ్‌ జైలుకే పరిమితం కావాల్సి ఉంటుంది.

తొలి వందే భారత్‌ స్లీపర్‌.. వచ్చేది ఆరోజేనా..?

ఈ కేసులో కేజ్రీవాల్‌కు సాధారణ బెయిల్‌ మంజూరుచేస్తూ ట్రయల్‌ కోర్టు గురువారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే.. ట్రయల్‌ కోర్టు తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఈడీ దిల్లీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే.. హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని.. అప్పటివరకు వేచి ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం సూచించింది. జూన్‌ 26న దీనిపై విచారణ చేపడతామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని