దిల్లీ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌

దేశ రాజధాని ప్రజలకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌  ఉచితంగా అందజేస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ శనివారం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం దర్యగంజ్‌లో చేస్తున్న వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  ప్రభుత్వం చేస్తున్న టీకా డ్రైరన్‌ సవ్యంగా జరుగుతోంది. దీంతో  దేశంలో మచ్చలేని వ్యవస్థ ఏర్పాటు కానుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు...

Published : 02 Jan 2021 17:47 IST

దిల్లీ: దేశ రాజధాని ప్రజలకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఉచితంగా అందజేస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ శనివారం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం దర్యగంజ్‌లో చేస్తున్న వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  ప్రభుత్వం చేస్తున్న టీకా డ్రైరన్‌ సవ్యంగా జరుగుతోంది. దీంతో దేశంలో మచ్చలేని వ్యవస్థ ఏర్పాటు కానుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 

‘షహ్దారాలోని జీటీబీ ఆస్పత్రి, దర్యగంజ్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ద్వారకాలోని వెంకటేశ్వర ఆస్పత్రులలో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో వ్యాక్సిన్‌ పంపిణీకి 1000 కేంద్రాలను ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాల్లో అత్యవసర గదులు ఏర్పాటు చేసి వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని గంటసేపు పరిశీలనలో ఉంచుతాం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అందరూ సామాజిక దూరం పాటిస్తూ.. కొవిడ్‌-19 జాగ్రత్తలు తీసుకోవాలి.  రోజూ సుమారు లక్ష మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు దిల్లీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  మొదటి విడతలో 51 లక్షల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తాం’అని మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని