Delhi High Court: విమానాల్లో మాస్కు ధరించకపోతే.. నో ఫ్లై జాబితాలోకి..!

విమానాశ్రయాల్లో, విమానాల్లో మాస్క్‌ నిబంధనను తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

Published : 04 Jun 2022 01:41 IST

దిల్లీ: విమానాశ్రయాల్లో, విమానాల్లో మాస్క్‌ నిబంధనను తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారికి భారీగా జరిమానా విధించాలని సూచించింది. ‘కొవిడ్ ముప్పు పూర్తి తొలగని నేపథ్యంలో నిబంధనలు అమలయ్యేలా చూడాలి. ప్రయాణ ఉల్లంఘనకు పాల్పడే వారిని అవసరమైతే అక్కడి నుంచి పంపివేయొచ్చు’ అంటూ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అయితే తాము భోజన సమయంలో మాత్రమే మాస్క్‌ తొలగించేలా సడలింపు ఇచ్చామని డీజీసీఏ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

నిబంధనల రూపకల్పన సమయంలోని తీవ్రతకు తగ్గట్టుగా అన్నిసార్లు వాటి అమలు జరగడం లేదని గుర్తించామని హైకోర్టు పేర్కొంది. ఇవి సరిగా అమలయ్యేలా అధికారులు, డీజీసీఏ చూడాలి. ‘మాస్కులు ధరించకుండా, పరిశుభ్రతా నియమాలను ఉల్లంఘించే ప్రయాణికులు, ఇతరులపై చర్యలు తీసుకునేలా డీజీసీఏ విమానాశ్రయాలు, విమానాల్లోని సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేయాలి. ఆ తరహా వ్యక్తులకు జరిమానా విధించాలి. అవసరమైతే వారిని విమానంలో నుంచి దించివేయాలి. వారి పేర్లను నో ఫ్లై జాబితాలో ఉంచాలి’ అని కోర్టు వెల్లడించింది. విమానాశ్రయాలు, విమానాల్లో కొవిడ్ నిబంధనల ఉల్లంఘనపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేస్తూ ఈ సూచనలు చేసింది. ప్రయాణికులు మాస్కులు ధరించడం లేదని, ఈ విషయాన్ని తాను గమనించినట్లు పిటిషనర్‌ తెలిపారు. కాగా, ఈ నిబంధనలు తప్పక అమలయ్యేలా.. డీజీసీఏ మార్గదర్శకాలు రూపొందించాలని కోర్టు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని