Netflix: ఇకపై అలాంటివి నెట్‌ఫ్లిక్స్‌లో నిషేధం!

కరోనా నేపథ్యంలో ఓటీటీల జోరు ఊపందుకుంది. విపరీతమైన క్రేజ్‌ సంపాదించికున్న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీకి మాత్రం తాజాగా దిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిజజీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘ఎ బిగ్ లిటిల్ మర్డర్’ డాక్యుమెంటరీ వాళ్లకీ సమస్య తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళ్లితే..  2018, జనవరి 8, 2018లో జరిగిన ఘటన ఇది.

Updated : 14 Aug 2021 17:28 IST

‘ఏ బిగ్‌ లిటిల్‌ మర్డర్‌’ డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిలిపివేయాలన్న దిల్లీ హైకోర్టు ఆదేశాలు

దిల్లీ: కరోనా నేపథ్యంలో ఓటీటీల జోరు ఊపందుకుంది. విపరీతమైన క్రేజ్‌ సంపాదించికున్న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీకి మాత్రం తాజాగా దిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిజజీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘ఎ బిగ్ లిటిల్ మర్డర్’ డాక్యుమెంటరీ వాళ్లకీ సమస్య తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళ్లితే.. జనవరి 8, 2018లో జరిగిన ఘటన ఇది. గురుగ్రామ్‌కు చెందిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వాష్‌రూమ్‌లో.. 7 ఏళ్ల బాలుడు మృతి చెందగా ఆ కథాంశంతో నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీ రూపొందించారు. ఆగస్టు 6 ఆ డాక్యుమెంటరీని విడుదల చేయగా.. అందులో తమ పాఠశాల పేరును ప్రస్తావించారని.. ఇది తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం.. జస్టిస్ జయంత్ నాథ్ ధర్మాసనం స్కూల్‌లో వచ్చే సన్నివేశాలను తీసేసి డ్యాకుమెంటరీని ప్రసారం చేయాలని తీర్పునిచ్చింది. కాగా ఈ డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్‌తో పాటు పలు సంస్థలతో అనుసంధానమై రూపొందించింది. 

కచ్చితంగా ఇవి పాటించాల్సిందే!
ముఖ్యంగా పిల్లల మరణాలపై డాక్యుమెంటరీని తీస్తున్నట్లైతే..  ఎక్కువగా ప్రభావితం చేసేలా ఉండకూడదని కోర్టు సూచించింది. పాఠశాలను ప్రస్తావించాల్సి వస్తే.. పేర్లు, భవనాలను చిత్రీకరించడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని