Delhi: బాణసంచా కాల్చేలా భాజపానే ప్రేరేపించింది: దిల్లీ మంత్రి

ఏటా దీపావళి వేళ దేశ రాజధాని దిల్లీలో బాణసంచా విషయంలో వివాదాలు తలెత్తుతాయి. బాణసంచా కాల్చితే కాలుష్యం మరింత పెరుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బాణసంచా కాల్చడాన్ని అక్కడి వాయుకాలుష్య నియంత్రణ కమిటీ నిషేధించింది. జనవరి 1 వరకు

Published : 05 Nov 2021 22:58 IST

దిల్లీ: ఏటా దీపావళి వేళ దేశ రాజధాని దిల్లీలో బాణసంచా విషయంలో వివాదాలు తలెత్తుతాయి. బాణసంచా కాల్చడం వల్ల కాలుష్యం మరింత పెరుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బాణసంచా కాల్చడాన్ని అక్కడి వాయుకాలుష్య నియంత్రణ కమిటీ నిషేధించింది. జనవరి 1 వరకు దిల్లీలో బాణసంచా కాల్చకూడదని స్పష్టం చేసింది. దీంతో పోలీసులు తనిఖీలు చేసి మరీ బాణసంచా కలిగి ఉన్న వారిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేస్తున్నారు. అయినా కొందరు బాణసంచా కాల్చి దీపావళిని జరుపుకొన్నారు.

కాగా.. ప్రజలను బాణసంచా కాల్చేలా భాజపానే ప్రేరేపించిందని దిల్లీలో అధికారంలో ఉన్న ఆప్‌ ప్రభుత్వం ఆరోపించింది. ‘‘దిల్లీలో చాలా మంది ప్రభుత్వం పిలుపు మేరకు బాణసంచా కాల్చలేదు. కానీ, కొంత మంది ఉద్దేశపూర్వకంగా బాణసంచాను కాల్చారు. వారిని అలా చేయమని భాజపానే ప్రేరేపించింది’’అని దిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ అన్నారు. మరోవైపు ఎయిర్‌ క్వాలిటీ ఫోర్‌కాస్ట్‌ ఏజెన్సీ సఫర్‌(SAFAR)దిల్లీలో వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. దిల్లీలో ప్రస్తుతం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 531గా ఉందని, ఇది అత్యంత తీవ్రమైన వాయు కాలుష్యమని పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని