Atishi: క్షీణిస్తోన్న ఆతిశీ ఆరోగ్యం

హరియాణా దిల్లీకి నీటిని విడుదల చేయాలని ఒత్తిడి చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఆప్‌ నేత ఆతిశీ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని వైద్యులు పేర్కొన్నారు.

Updated : 24 Jun 2024 18:16 IST

దిల్లీ: కొంత కాలంగా దిల్లీ నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం దేశ రాజధానికి నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో దిల్లీ మంత్రి అతిశీ(Atishi)  చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించిన  వైద్యులు ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారు.  

ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా రక్తపోటు, చక్కెర స్థాయిలు పడిపోతున్నాయి. బరువు తగ్గాను. దీని వల్ల భవిష్యత్తులో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయినా నేను దిల్లీ ప్రజల తరపున పోరాడతాను. హరియాణా నీటిని విడుదల చేసే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తా’’ అని పేర్కొన్నారు. ఎంత వేడుకున్నా హరియాణా ప్రభుత్వం రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల (MGD) నీటిని కూడా విడుదల చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల దేశ రాజధానిలో 28 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆతిశీ దీక్షకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని ఆప్‌(AAP) పేర్కొంది. హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini)ని కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించినట్లు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని