Satyendar Jain: సత్యేంద్ర జైన్‌కు లభించని ఊరట.. మరో 14రోజులపాటు కస్టడీ పొడిగింపు

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. మరో రెండు వారాలపాటు (14రోజులు) జైన్‌కు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ.......

Published : 27 Jun 2022 21:03 IST

దిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. మరో రెండు వారాలపాటు (14రోజులు) జైన్‌కు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. సత్యేంద్ర జైన్ (Satyendar Jain) కస్టడీని పొడిగించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ కస్టడీ పొడిగింపు ఆదేశాలను జారీ చేశారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్న ఈ ఆమ్‌ ఆద్మీ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.

తీహాడ్‌ జైలులో (Tihar Jail) శిక్ష అనుభవిస్తున్న సత్యేంద్ర జైన్‌ కొద్దిరోజుల క్రితం అనారోగ్యం బారినపడటంతో అధికారులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో దిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో (money laundering case) మే 30వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ  దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు మూడు నెలల క్రితం సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. అనంతరం ఆయన్ను అరెస్టు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని