Covid Wave: ఒక్కరోజే.. దిల్లీలో 82శాతం, ముంబయిలో 54శాతం పెరుగుదల

దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus) ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ముంబయి (Mumbai) నగరంలో నిన్న 614 కేసులు వెలుగు చూడగా.. నేడు ఏకంగా 1118 కేసులు బయటపడ్డాయి.

Updated : 14 Jun 2022 19:25 IST

దేశవ్యాప్తంగా 50వేలు దాటిన యాక్టివ్‌ కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus) ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో (Delhi) నగరంలో నిన్న 614 కేసులు వెలుగు చూడగా.. నేడు ఏకంగా 1118 కేసులు బయటపడ్డాయి. కొవిడ్‌ కేసుల్లో ఒకే రోజులో 82శాతం పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం కొవిడ్‌ పాజిటివిటీ రేటు (Positivity Rate) 6.5శాతానికి చేరడం ఆందోళన కలిగించే విషయం. నేడు మరో ఇద్దరు కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 26,223కు చేరింది.

గత కొన్నిరోజులుగా దిల్లీ, ముంబయి నగరాల్లో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో క్రియాశీల కేసుల (Active Cases) సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దిల్లీలో యాక్టివ్‌ కేసులు 3177కి చేరిపోగా.. ముంబయిలోనూ 15వేల కేసులు రికార్డయ్యాయి. గడిచిన పది రోజుల్లో మహారాష్ట్ర కొవిడ్‌ కేసుల్లో 241శాతం పెరుగుదల నమోదైంది.

కొవిడ్‌ విజృంభణతో వణుకుతోన్న ముంబయి (Mumbai) నగరంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1724 కేసులు రికార్డయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 54శాతం కేసులు పెరిగాయి. నగరంలో మొత్తం 11వేల కొవిడ్‌ టెస్టులు (Covid Test) నిర్వహించగా.. వాటిలో 1724 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) అధికారులు వెల్లడించారు. కొవిడ్‌ బాధితుల్లో నేడు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. కొవిడ్‌ బాధితుల రికవరీ రేటు (Recovery Rate) 97శాతంగా ఉందని చెప్పారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే, గత మూడురోజులుగా నిత్యం 8వేల కేసులు నమోదవుతుండగా నేడు కొత్తగా 6వేల కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం దేశంలో కొవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 50వేలు దాటిందని పేర్కొంది. మహారాష్ట్ర, దిల్లీ, కేరళ రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉందని.. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని