High Alert: దేశ రాజధానికి ఉగ్రముప్పు.. అప్రమత్తమైన పోలీసులు!

దేశ రాజధాని దిల్లీలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో అక్కడి పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దిల్లీ నగర పోలీసు కమిషన్‌ రాకేశ్‌ అస్థానా శనివారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు...

Published : 10 Oct 2021 11:11 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో అక్కడి పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దిల్లీ నగర పోలీసు కమిషనర్‌ రాకేశ్‌ అస్థానా శనివారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పండగ సీజన్‌ నేపథ్యంలో భారీ దాడికి ఉగ్రమూకలు యత్నించే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయన్నారు.

దీన్ని అరికట్టడానికి అన్ని చర్యలు చేపట్టాలని రాకేశ్‌ అస్థానా పోలీసులను ఆదేశించారు. స్థానికుల సహకారం లేకుండా ఉగ్రవాదులు ఈ దుశ్చర్యలకు పాల్పడే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ముష్కరులకు స్థానికుల సాయం అందకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం స్థానిక మెకానిక్‌ దుకాణాలు, సైబర్‌కేఫ్‌లు, రసాయనాల దుకాణాలు, తుక్కు కేంద్రాలు, కార్ల డీలర్ల వద్ద క్షుణ్నంగా తనిఖీలు చేయాలని సూచించారు. పెట్రోల్‌ పంపులు, ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకునే సంకేతాలు ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నిత్యం నిఘా ఉంచాలని ఆదేశించారు. అలాగే క్షేత్రస్థాయిలో స్థానిక వాచ్‌మేన్లు, కాలనీ, అపార్ట్‌మెంట్ కమిటీలతోనూ సమావేశం నిర్వహించి వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ఇటీవల కొత్తగా వచ్చిన వలస కార్మికులు, ఇళ్లల్లో అద్దెకు ఉంటున్నవారిని సైతం క్షుణ్నంగా పరిశీలించాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని