దిల్లీ ఘటనపై సమాచారమివ్వండి

గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన ఏదైనా సమాచారం ప్రజల వద్ద ఉంటే తమకు అందించాలని దిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated : 29 Jan 2021 23:53 IST

ప్రజలను కోరిన దిల్లీ పోలీసులు

దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన ఏదైనా సమాచారం ప్రజల వద్ద ఉంటే తమకు అందించాలని దిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘ పాత్రికేయులతో సహా ప్రజలందరికీ దిల్లీ పోలీసుల తరఫున ఓ విజ్ఞప్తి.. గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో జరిగిన ఘటనకు ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నా.. ఏదైనా సమాచారం, వీడియోలు, ఫొటోలు మీ వద్ద ఉన్నా పాత దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చి అందించవలసిందిగా కోరుతున్నాం. మీరు నేరుగా రాలేకపోయినా మా ఫోన్‌ నంబరు (8750871237)కు ఫోన్‌ చేసి గానీ, మెయిల్‌ గానీ చేయొచ్చు’’ అని పోలీసులు ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

ఇవీ చదవండి..

బడ్జెట్‌ విశేషాలు తెలుసా..

చైనాతో పోరుకు ముందు..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు