ట్రాక్టర్‌ ర్యాలీకి పోలీసుల అనుమతి!

వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి దిల్లీ పోలీసులు అనుమతిచ్చినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. 26న ఘజీపూర్‌, సింఘు, టిక్రి సరిహద్దుల....

Published : 23 Jan 2021 21:15 IST

దిల్లీ: వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి దిల్లీ పోలీసులు అనుమతిచ్చినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. 26న ఘాజీపూర్‌, సింఘు, టిక్రి సరిహద్దుల నుంచి ఈ ర్యాలీ ప్రారంభమవుతుందని రైతు నేత అభిమన్యు కోహర్‌ తెలిపారు. రాత్రికి పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. ఈ మేరకు రైతు సంఘాలు, పోలీసుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ర్యాలీలో వేల మంది రైతులు పాల్గొంటారని మరో రైతు నేత గుర్నామ్‌ సింగ్‌ తెలిపారు. ఆ రోజు దిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగిస్తారని చెప్పారు. శాంతియుతంగా ఈ ర్యాలీలో పాల్గొనాలని రైతులకు నేతలు సూచించారు. 

ఇవీ చదవండి..
భారత్‌లో 150కి చేరిన యూకే స్ట్రెయిన్‌ కేసులు
మీ పేరు కమలా?..అయితే మీకో ఆఫర్!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని