CDS: సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌కు జడ్‌ ప్లస్‌ భద్రత

భారత నూతన త్రిదళాధిపతి (సీడీఎస్‌)గా బాధ్యతలు స్వీకరించిన అనిల్‌ చౌహాన్‌కు కేంద్రం జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించింది. దిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తారని......

Published : 03 Oct 2022 19:39 IST

దిల్లీ: భారత నూతన త్రిదళాధిపతి (సీడీఎస్‌)గా బాధ్యతలు స్వీకరించిన అనిల్‌ చౌహాన్‌కు కేంద్రం జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించింది. దిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత అత్యున్నత సైనిక కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్‌ చౌహాన్‌కు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో భద్రత కల్పిస్తున్నట్టు సీనియర్ పోలీస్‌ అధికారి ఒకరు ధ్రువీకరించారు. తొలి త్రివిధ దళాధిపతిగా పనిచేసిన జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన తొమ్మిది నెలల తరవాత కేంద్ర ప్రభుత్వం అనిల్‌ చౌహాన్‌ను దేశ రెండో సీడీఎస్‌గా నియమించిన విషయం తెలిసిందే.

త్రివిధ దళాల పోరాట సామర్థ్యానికి మరింతగా పదును పెట్టడంతో పాటు వనరుల సమర్థ వినియోగానికి ఉద్దేశించిన థియేటరైజేషన్‌ ప్రణాళిక అమలే లక్ష్యంగా తదుపరి సీడీఎస్‌ ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేసిన కేంద్రం.. కొత్త సీడీఎస్‌గా అనిల్‌ చౌహాన్‌ను ఇటీవల ఎంపిక చేసింది. ఇక నుంచి భారత అత్యున్నత సైనిక కమాండర్‌గా ఆయనే కొనసాగనున్నారు. భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ విధులు నిర్వర్తించనున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని