నీటి కోసం ఆందోళన చేస్తుంటే నీళ్లతో చెదరగొట్టారు!

దేశ రాజధానిలో సోమవారం ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నీటి కొరతపై ఆందోళన చేస్తున్న భాజపా కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు ట్యాంకర్ల కొద్ది నీటిని వృథా చేశారు. అసలేం జరిగిందంటే.. దిల్లీలో తీవ్ర నీటి కొరత ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో

Published : 14 Jul 2021 01:24 IST

దిల్లీ: దేశ రాజధానిలో సోమవారం ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నీటి కొరతపై ఆందోళన చేస్తున్న భాజపా కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు ట్యాంకర్ల కొద్ది నీటిని వృథా చేశారు. అసలేం జరిగిందంటే.. దిల్లీలో తీవ్ర నీటి కొరత ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీటి కొరత సమస్యను పరిష్కరించాలంటూ భాజపా శ్రేణులు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. కాగా.. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులపై పోలీసులు జల ఫిరంగులు ఉపయోగించారు. 

పోలీసుల చర్యపై దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా మండిపడ్డారు. ‘‘దిల్లీలో ప్రతి ఒక్క ఇంటికి నల్లానీరు ఇస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ.. నెరవేర్చలేదు. ఇప్పుడు దిల్లీలో ప్రతిచోట తీవ్ర నీటి కొరత ఉంది. కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఉన్నా.. మురుగు నీళ్లు సరఫరా చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి’’అని ఆరోపించారు. పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించడంతో పార్టీ కార్యకర్తలు, నేతలు తడిసిముద్దయ్యారని, వారి మొబైల్‌ఫోన్లు పాడయ్యాయని భాజపా మీడియా విభాగం చీఫ్‌ నవీన్‌ కుమార్‌ ఆరోపించారు. దిల్లీలో నీటి మాఫియాను పెంచిపోషించడానికే నీటి కొరతను సృష్టించి.. ప్రజలు నీళ్ల ట్యాంకర్లపై ఆధారపడేలా చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

నీటి కొరతపై దిల్లీ జల్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ మాట్లాడుతూ.. హరియాణా ప్రభుత్వం నీటి సరఫరాను తగ్గించడం వల్లనే దిల్లీలో నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. హరియాణా రాష్ట్రం నీటి సరఫరాను గతంలో కంటే ఇప్పుడు మరింత తగ్గించి రోజుకు 120 మిలియన్‌ గ్యాలన్ల(ఎండీజీ) నీటిని మాత్రమే విడుదల చేస్తోందని చెప్పారు. దీంతో దిల్లీలో రోజుకు 100మిలియన్‌ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని