Covid Cases: దిల్లీలో కేసులు పైపైకి.. 25 శాతం దాటిన పాజిటివిటీ రేటు

దేశ రాజధాని దిల్లీలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24 గంటల వ్యవధిలో స్థానికంగా 21,259 కొత్త కేసులు నమోదయ్యాయి. సోమవారంతో నమోదైన 19,166 కేసులతో పోల్చితే...

Published : 11 Jan 2022 23:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ రాజధాని దిల్లీలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ ప్రభావంతో కొవిడ్‌ కేసుల  సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో స్థానికంగా 21,259 కొత్త కేసులు నమోదయ్యాయి. సోమవారం నమోదైన 19,166 కేసులతో పోల్చితే ఇవి దాదాపు 10 శాతం అధికం. అలాగే, మరో 23 మరణాలూ సంభవించాయి. ఎనిమిది నెలల్లో అత్యధిక మరణాల సంఖ్య ఇదే కావడం గమనార్హం. పాజిటివిటీ రేటు సైతం 25.65 శాతానికి చేరుకుంది. గతేడాది మే 5 తర్వాత ఇదే అధికం. యాక్టివ్‌ కేసులు 74,881లతో  ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరాయి. అయితే, కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ దిల్లీలో లాక్‌డౌన్‌ విధించబోమని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈరోజు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్థానికంగా మహమ్మారి కట్టడికి అన్ని చర్యలూ తీసుకొంటున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ముంబయిలో మాత్రం వరుసగా నాలుగో రోజు కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 24 గంటల వ్యవధిలో 11,647 కొత్త కేసులు బయటపడ్డాయి. రెండు మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం నగరంలో లక్ష వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 11.58 శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని